డీటీసీ పాపారావు అధికారాలకు కత్తెర

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గత ప్రభుత్వం హయాంలో ఆర్టీఏలో చక్రం తిప్పిన డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ (డీటీసీ) పాపారావు అధికారాలకు సర్కారు కత్తెర పెట్టింది. ఖైరతాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ డీటీసీగా ఉన్న పాపారావు నల్లగొండ డీటీసీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నల్లగొండ డీటీసీ అదనపు బాధ్యతల నుంచి పాపారావు తప్పిస్తూ రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మహబూబ్‌ నగర్‌ డీటీసీ దుర్గా ప్రమీలను నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరీంనగర్‌ డీటీసీ ఆఫీస్‌లో ఉన్న కష్ణమనేని వెంకట రమణరావు ట్రాఫిక్‌ అవేర్‌ నెస్‌ పార్క్‌ పేరును జువ్వాడి చొక్కారావు ట్రాఫిక్‌ అవేర్‌ నెస్‌ పార్క్‌ గా మారుస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. కష్ణమనేని వెంకట రమణరావు పాపారావు తండ్రి కావటం గమనర్హం.,