
విద్యరులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యత తో కూడిన భోజనన్ని అందించేలా చూడలని జిల్లా డిటీడీఓ అంబాజీ నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కుబీర్ ఆశ్రమ పాఠశాల, డోడర్నా ఆశ్రమ పాఠశాల ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు వచ్చే నెల నుంచి మారిన మెనూ ప్రకారం భోజనము అందించాలని అధికారులకు సూచించారు. అదే విదంగా ముక్యంగా చలి కాలంలో విద్యార్థులకు అవసరమైన రగ్గులు, దుప్పట్లు ఉన్నాయని విద్యార్థులకు అడిగితెలుసుకున్నారు. పాఠశాలలో వంట గదులను పరిశీలించి వంట గదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడలని అన్నారు. విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగితెలుసుకున్నారు. అక్కడి నుంచి పాఠశాల కార్యాలయంలో ఉన్న పాలు రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు, చిన్నాన్న, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.