నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
క్రీడా పాఠశాల ఉపాధ్యాయుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడిన డీఈఓపై చర్యలు తీసుకోవాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో ఉపాధ్యాయుల డీప్యూటేషన్ నియమకాలలో పారదర్శకత పాటించలేదని ఆరోపించారు. రాజకీయ నాయకులు, సంఘాలు పైరవీ కారుల ఒత్తిడి మేరకు అర్హత లేని వారికి అక్రమంగా నియమించారన్నారు. ఒక సబ్జెక్టుకు ఒకరిన నియమించాల్సింది పోయి ఆంగ్లం, భౌతిక శాస్త్రంలో తనకు అనుకూలంగా ఉన్న ఇద్దరేసిని నియమించారని ఆరోపించారు. ఇలాంటి డీఈఓ వైఖరి వల్ల జిల్లా విద్యాశాఖ సమాజంలోఅబసుపలవుతుందన్నారు. నియమనిబంధనలు అమలు చేయవలసిన డీఈఓ అక్రమాలకు పాల్పడుతూ తాను ఇచ్చిన నోటిఫికేషన్‌కు భిన్నంగా నియమకాలు జరిపిన డీఈఓను సస్పెండ్ చేసి నూతన డీఈఓను నియమించాలన్నారు.