డీటీఫ్ రాష్ట్ర నాయకులు రొడ్డ రాజన్నకు అశ్రునివాళి

నవ తెలంగాణ – జక్రాన్ పల్లి 
డీటీఫ్ రాష్ట్ర నాయకులు, నిజామాబాదు జిల్లా ప్రధాన కార్యదర్శి రొడ్డ రాజన్న శుక్రవారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స  పొందుతూ మరణించారు. అతని అంతక్రియలు ఈరోజు ఉదయం 12 గంటలకు అతని స్వగ్రామం మనోహరబాద్, జక్రాన్ పల్లి మండలం, నిజామాబాదు జిల్లా యందు జరిగినాయి. అంతిమ యాత్రలో డీటీఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. లింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, సామ్యూల్, శ్రీనివాస్ రెడ్డి, పి. శంతన్,టి. సుదర్శనఓ,విజయరామరాజు, యుటిఎఫ్ సత్యనంద్, రమేష్, ఎస్ టి యు, శ్రీకాంత్, ధర్మేందర్, పి.ఆర్.టి. యు మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్ గౌడ్,ఎస్సీ ఎస్టీ నుండి, వై విజయ్ కుమార్, జి.సుదాం, టి పి టి ఎఫ్ సల్ల సత్యనారాయణ, బహుజన టీచర్స్ యూనియన్, ప్రతాప్, పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్,సిద్ధిరాములు న్యాయవాది, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కె సుధాకర్, సీపీఐ యం యల్ ప్రజాపంథా నాయకులు వి. ప్రభాకర్, దేవరాం,ముతేన్న,కిషన్, పిడిఎస్యు నాయకులు అనిల్, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు,ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులు, మిత్రులు, బంధువులు పాల్గొన్నారు. డీటీఫ్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి .లింగారెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థి దశలో విప్లవ విద్యార్థి సంఘం పిడిఎస్యు నాయకునిగా పనిచేశారు. ప్రభుత్వం టీచర్ గా పని చేస్తూ డిటిఫ్ నిజామాబాదు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూనే అమరుడు అమరుడైనని అన్నారు.ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నీతి నిజాయితీతో, నిబద్దతతో పనిచేశారని అన్నారు. సామజిక బాధ్యతగా అనేక సాంఘిక దూరచారాలకు వ్యతిరేకంగా పోరాడినరాని, కుల వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించారని అన్నారు.ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేశారు.రాజన్న ఆశయాల బాటలో ప్రయాణిస్తామని పేర్కొన్నారు.జోహార్లు.ఈ దోపిడీ సమాజం మార్పు కోసం పరితపించే నిరంతర కార్యాసాడుకుని మరణం ఉపాధ్యాయ ఉద్యమాలకు,ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరనిలోటని అన్నారు..రొడ్డ రాజన్నకు విప్లవ జోహార్లు తెలిపారు.అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.