దుర్భర పరిస్థితిలో దుబ్బ పాఠశాల 

Dubba school in a deplorable condition– మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రజావాణిలో ఫిర్యాదు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దుబ్బ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కి సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. ఈనెల 19 తేదీన దుబ్బ పాఠశాలలను సర్వే చేయడం జరిగింది. మొత్తంగా 463 మంది విద్యార్థులు ఉంటే వారికి క్లాస్ రూమ్స్ సరిగ్గా లేకపోవడం బాధాకరమని అన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో, విద్యార్థినిలకు, లేడీ టీచర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పాఠశాలల్లో కనీస వసతులు 9వ తరగతి పదవ తరగతి విద్యార్థులకు రూమ్స్ లలో ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ లేకపోవడం విడురమని అన్నారు. సరిగ్గా స్విచ్ బోర్డ్స్ లేకపోవడంతో విద్యార్థులకు షార్ట్ సర్క్యూట్స్ అయితే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. దాంతో పాటు పాఠశాలలో విద్యార్థుల చదువు కోసం ప్రొజెక్టర్లు ఉపయోగించిన సరైన ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోవడంతో చదువు అందని ద్రాక్షగా మారిందని అన్నారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ని కోరగా వారు సానుకూలంగా స్పందించి దుబ్బ పాఠశాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాజు, వినీత్ తదితర నాయకులు పాల్గొన్నారు.