దుబ్బాక అభివృద్ధి బిఆర్ఎస్ తోని సాధ్యం

నవతెలంగాణ – మిరు దొడ్డి 
దుబ్బాక నియోజకవర్గం బీఆర్ఎస్ తోని సాధ్యమవుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భూంపల్లి మనోహర్ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు  తుమ్మల బాలరాజు అన్నారు. మంగళవారం మిరుదొడ్డి మండలం కాస్లాబాద్ గ్రామంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కొత్త ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి గ్రామాలను మరింత అభివృద్ధి చేయించుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. గత మూడు సంవత్సరాలు బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలవడం మూలంగా నియోజవర్గం నష్టపోయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వతో దుబ్బాకను మరింత అభివృద్ధి చెందడానికి కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి ఉంటుంది అని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి దుబ్బాక అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బిక్షపతి యాదగిరి భూపతి మైసయ్య తదితరులు పాల్గొన్నారు.