
దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఓకేషనల్ కోర్సు ఎలక్ట్రికల్ టెక్నీషియన్(ET )గ్రూపు మొదటి సంవత్సర పరీక్షల్లో డి. సుకుమార్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. మార్చి నెలలో జరిగిన వార్షిక పరీక్షల్లో విద్యార్ధి సుకుమార్ 500 మార్కులకు గానూ 491 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం పొందాడు.జూన్ లో నిర్వహించిన అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలలో ఇంప్రూవ్ మెంట్ రాసి, 496 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం పొందాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పి. లక్ష్మీనారాయణ, ఈటీ గ్రూపు లెక్చరర్ ఎ. తిరుపతి రెడ్డి అభినందించారు