– చికిత్స పొందుతున్న ఎంపీ కోలుకోవాలి
– పద్మనాభునిపల్లి హనుమాన్ దేవాలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు
నవతెలంగాణ- దుబ్బాక రూరల్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై యుట్యూబ్ ఛానల్ రిపోర్టర్ తో బీబీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హత్యయత్నం చేయించడం దురదృష్ట కరమైన ఘటన. దుబ్బాక నియోజకవర్గంలో ప్రజల్లో ఎంపీపై పెరుగుతున్న ఆదరణ జీర్ణించుకోలేక బీజేపీ కుట్రలకు తెరలేపుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత బాధాకరమని పద్మనాభునిపల్లి బీఆర్ఎస్ నాయకులు అన్నారు. హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఎంపీ త్వరగా కొల్కోవాలని సర్పంచ్ పర్షారాములు ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పర్షా రాములు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముక్కపల్లి మహేందర్, సోషల్ మీడియా అధ్యక్షుడు మండల పరమేష్, యూత్ అధ్యక్షుడు ఇంచార్జీ చింతకింది రమేష్ మీడియాతో మాట్లాడుతూ దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య దేశంలో హత్య రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. బీజేపీ నాయకులు గూండా రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం మెదక్ పార్లమెంట్ సభ్యుడు అహర్నిశలు కృషి చేస్తుంటే ఆయనపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. నియోజకవర్గ ప్రజలు రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీకి చూపిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకోలేక దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక బీజేపీ నాయకులు హస్తం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తలుచుకుంటే దాడి చేసిన వారిని, వారి వెనుక ఉన్నవారు ప్రజాక్షేత్రంలో తిరగలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో వారీ వెంట బూత్ అధ్యక్షులు ఐలయ్య, అశోక్, శంకరయ్య, హరీష్, రమేష్ తదితరులు ఉన్నారు.