
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
బీఆర్ఎస్ నాయకులకే కాకుండా అర్హులైన వారందరికీ బీసీ బంధు పథకాన్ని ఇవ్వాలనీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలో అర్హులైన బిసీలందరికి బిసి బంధు పధకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరస్తా లో బిజెపి నాయకులు కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ధర్నాకు పర్మిషన్ లేని కారణంగా ఎమ్మెల్యేను అరెస్టు చేసి అక్బర్పేట్ భూంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకుల పై కేసులు అయినట్లు దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపారు.