సద్ది రాజిరెడ్డిని పరామర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే 

నవతెలంగాణ దుబ్బాక రూరల్ 
దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామ సర్పంచ్ సద్ది రాజిరెడ్డి తల్లి వజ్రవ్వ శుక్రవారం  అనారోగ్యంతో మృతి చెందింది. ఐతే ఈ విషయం పలువురు బీఆర్ఎస్ నాయకుల ద్వారా తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వజ్రమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట దుబ్బాక జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి పంతులు, మూర్తి శ్రీనివాస్ రెడ్డి, రవి, రాజు, కార్తిక్ తదితరులు ఉన్నారు