– తొగుట మండలానికి 3.33 కోట్లు మంజూరు.
– కమీషన్లు ఉన్న పనులకే ప్రాముఖ్యత ఇచ్చిన గత ప్రభుత్వం.
– దుబ్బాక నియోజకవర్గ అభివృద్దే ఎజెండాగా పనిచేస్తా.
నవతెలంగాణ-తొగుట : గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం మూలంగా అభి వృద్ది లో దుబ్బాక నియోజవర్గం వెనకబడిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజ కవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతానని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరు కు శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.గురువారం మండ లంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి నీ కోరగా సానుకూలంగా స్పందించారని, ఒక రోజులోనే జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ స్పందించి తొగుట మండలానికి రూ. 3.33 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. అందులో రూ.1.05 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కాగా,
రూ. 2.28 స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ గా నిధు లు మంజూరు అయ్యాయన్నారు. గతంలో ముత్యం రెడ్డి శంకుస్థాపన చేసి పెండింగ్ లో ఉన్న పనులు, ప్రస్తుతం కమ్యూనిటీ హాళ్లు, గోదాములు, సీసి రోడ్లు, మహిళా భవనాలు తదితర అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగిస్తామని తెలి పారు. గత ప్రభుత్వం అభివృద్ధిని మరిచి కమీషన్లు ఉన్న పనులకే ప్రాముఖ్యత ఇచ్చి ప్రజల అవసరా లు తీర్చే పనులు చేయలేదనీ విమర్శించారు. మండలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేసి ప్రజ లకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత తీసుకుంటానని, పాఠశాలలు, కళాశాల ల అభివృద్ధికి మరో రెండు కోట్లు మంజూరు చేయిస్తా నని హామీ ఇచ్చారు. గతంలో స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి హయాంలో అభివృద్ధి చెందిందని అన్నారు. అదే విదంగా నియోజకవ ర్గాన్ని అభివృద్ది ముత్యంరెడ్డి ఆశయాలు నెరవేరు స్తానని అన్నారు.
– అభివృద్ది పనులకు భూమి పూజ
మండలం జప్తి లింగారెడ్డిపల్లి గ్రామంలో ఎన్ ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా రూ. 10 లక్షలు,ఎస్సీ కమ్యూనిటీ హాల్ రూ. 10 లక్షలు, రెడ్డి సంఘంకు రూ. 10 లక్షలు, ఎస్డిఎఫ్ నిధుల ద్వారా రూ. 10 లక్షల సిసి రోడ్డు, లింగపుర్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళ భవనం, సిసి పలు అభి వృద్ధి పనులకు టెంకాయ కొట్టి, భూమి పూజ చేశా రు. ఎల్. బంజేరుపల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనం, కాన్గల్ గ్రామంలో యాదవ సంఘం, ఎస్సీ కమ్యూనిటీ హాల్, వెంకట్రావు పేట లో అసం పూర్తిగా ఉన్న గోదాముకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తొగుట ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి కనకయ్య, తొగుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు అక్కం స్వామి, సీనియర్ కాంగ్రెస్ నాయకు లు భూపాల్ రెడ్డి, చెరుకు విజయ్ రెడ్డి, స్వామి, కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు సంతోష్,నాయకులు పంది రాజు,బెజనమైన రాములు,అనిల్ తదితరులు పాల్గొన్నారు.