– బెన్ అజేయ శతకం
– ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 207/2
– భారత్ తొలి ఇన్నింగ్స్ 445/10
రాజ్‌కోట్ : ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ (133 నాటౌట్, 118 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ దంచికొట్టాడు. 88 బంతుల్లోనే శతకం సాధించిన బెన్ డకెట్ రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌కు అదిరే ఆరంభాన్ని అందించాడు. బెన్ డకెట్ వన్‌మ్యాన్ షోతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలోనే 2 వికెట్లకు 207 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌కు మరో 238 పరుగుల వెనుకంజలో నిలిచింది. అంతక ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (112, 225 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతక విన్యాసానికి ఆరంభంలోనే తెరపడగా.. అరంగ్రేట ఆటగాడు ధ్రువ్ జురెల్ (46, 104 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవిచంద్రన్ అశ్విన్ (37, 89 బంతుల్లో 6 ఫోర్లు) లోయర్ ఆర్డర్‌లో రాణించారు. ఇంగ్లాండ్ పేసర్ మార్క్‌వుడ్ నాలుగు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు.
డకెట్ దంచాడు
భారత్ నాలుగున్నర సెషన్లలో చేసిన స్కోరుకు.. కేవలం ఒకే ఒక్క సెషన్లో చేరువ చేశాడు బెన్ డకెట్. 21 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగిన డకెట్.. ఇంగ్లాండ్‌కు ధనాధన్ ఆరంభాన్ని అందించాడు. డకెట్ జోరుతో ఇంగ్లాండ్ ఓవర్‌కు 5.91 చొప్పున పరుగులు చేసింది. ఓపెనర్ జాక్ క్రావ్లీ (15), ఒలీ పోప్ (39)లు వికెట్ కోల్పోయారు. జో రూట్ (9 నాటౌట్)తో కలిసి బెన్ డకెట్ అజేయంగా నిలిచాడు. జాక్ క్రావ్లీ వికెట్‌తో భారత స్పిన్నర్ అశ్విన్ టెస్టుల్లో 500వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
రాణించిన ధ్రువ్
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ రెండో రోజు మరో 119 పరుగులు జోడించింది. ఐదు వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ ఆతిథ్య జట్టు ఆశించిన స్కోరు సాధించ లేదు. సెంచరీ హీరో రవీంద్ర జడేజా ఆరంభంలోనే వికెట్ కోల్పోయాడు. దీంతో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్‌లు ఎనిమిదో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. జశ్‌ప్రీత్ బుమ్రా (26) సైతం మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగాడు. దీంతో 130 ఓవర్లలో 445 పరుగులకు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై భారత్ కనీసం ఓ వంద పరుగులు తక్కువ చేసిందనే అంచనాలు ఉన్నాయి!.