రెంజల్ మండలానికి వలస వచ్చిన బాతులు..

Ducks migrated to Renjal mandal..నవతెలంగాణ – రెంజల్ 

తిరుపతి నుంచి బాతులకు మేత కరువడంతో రెంజల్ మండలానికి బాతులను తీసుకొని రావడం జరిగిందని బాతుల యజమానులు పేర్కొంటున్నారు. రెంజల్ మండలంలో వరి కోతలు పూర్తి అవుతుండడంతో పంట పొలాల్లో పడిన ధాన్యం గింజలను తినిపించడానికి వారు వలస వచ్చారు. వందల కొలది బాతులను వారు వరికోత పూర్తయిన పంట పొలాల్లో తీసుకువెళ్లి వాటికి మేతను అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం వరి కోతలు పూర్తయ్యేసరికి వారు ఇక్కడికి వచ్చి బాతులకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు బాతుల గుడ్లను జమ చేస్తూ, మూడు, నాలుగు రోజుల కుమారు వాటిని తిరుపతికి తరలిస్తామని వారు తెలిపారు బాతు గుడ్లకు అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొన్నారు.