– హత్య రాజకీయాలకు కేరాఫ్ పుట్ట
– నారాయణరెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది మంత్రి శ్రీదర్ బాబు
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు:
చల్లా నారాయణరెడ్డి, పుట్ట మధులు మంథని నియోజకవర్గంలో తమ ఉనికి కోల్పోతున్నామని కావాలనే రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన సోదరుడు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబుపై నిరాదరమైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య లు ఆరోపించారు సోమవారం మండలంలోని రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా మంత్రి ముందుకు వెళ్తున్నారన్నారు. మంత్రి, ఆయన సోదరుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని,ఇప్పటికై నా బేషరతుగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు.హత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ పుట్ట మధున్నారు.దుద్దిళ్ల కుటుంబం స్వర్గీయ శ్రీపాద ఇరవై ఏళ్ళు, శ్రీదర్ బాబు ఇరవై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ప్రజా సంక్షేమం, అభివృద్దే ద్యేయంగా ముందుకు వెళుతున్న నేపథ్యంలో మంథని నియోజకవర్గం శాoతియుతంగా,ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని తెలిపారు. నాలుగేళ్ళ పుట్ట మధు పాలనలో నియోజకవర్గంలో హత్యలు, హత్య రాజకీయాలతో ప్రజలు ఆందోళనకు గురైన విషయం నిజం కాదని ప్రశ్నించారు.చల్లా నారాయణరెడ్డికి దుద్దిళ్ల కుటుంబం రాజకీయ భిక్ష పెడితే దుద్దిళ్ల కుటుంబంపై నిరాదారమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుసేటన్నారు.ఈ ఇద్దరు నాయకులను నియోజకవర్గ ప్రజలు నమ్మరని తెలియడంతో మతిస్థిమితం కోల్పోయి మాట్లాతున్నారని విమర్శించారు.పుట్ట,చల్లా కుమ్మక్కై నిచపు రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ సంగ్గెం రమేష్,జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి,చంద్రగిరు అశోక్,శ్రీనివాస్ పాల్గొన్నారు.