నవతెలంగాణ మల్హర్ రావు.
అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు బుధవారం కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీను బాబు, ప్రముఖ సినీ నిర్మాత కాంగ్రెస్ నాయకులు బండ్ల గణేష్ హాజరై మాట్లాడారు మంథని నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి ప్రదాత రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గలలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గడపగడపకు తిరుగుతూ వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. రైతులకు, మహిళలకు అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధర్ బాబు గెలుపు కోసం ఎలాగైతే కష్టపడి 6 గ్యారంటీలను గడపగడకి తీసుకెళ్ళి విజయం సాధించామో త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇంటింటికీ 5 న్యాయ్ పథకాలను తీసుకెళ్లి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం లో అత్యధిక మెజారిటీ మంథని నియోజకవర్గం నుండి వచ్చేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.