గడ్డం వంశీని గెలిపించాలి: దుద్దిళ్ల శ్రీను బాబు 

– ప్రచార రథాన్ని, ఐదు గ్యారంటీ పథకాల వాల్ పోస్టర్ లను విడుదల చేసిన శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు 
నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు కాంగ్రెస్ నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు బుధవారం మంథని నియోజకవర్గంలోని మల్హర్ రావు మండలం కొయ్యూరు గ్రామములో లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని జెండా ప్రారంభించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఐదు (న్యాయ్) గ్యారంటీ పథకాల వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.కాంగ్రెస్బపార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. బిజెపి,బిఆర్ఎస్ రెండు ఒక్కటేనని ప్రజలు అరేండు పార్టీలను నమ్మరన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య,జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ,రాజిరెడ్డి,యూత్ మంథని నియోజకవర్గ నాయకుడు మండల రాహుల్,సవేందర్, యూత్ మండల  అధ్యక్షుడు గడ్డం క్రాoతి,సింగిల్ విండో డైరెక్టర్ రమేష్ రెడ్డి,జంగిడి సమ్మయ్య,వేల్పుల రవి,మహేందర్,మమత,కలిమోద్దీన్,బోయిని రాజయ్య, మంథని రాజ సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.