రాజీవ్ గాంధీ సేవలు మరువలేని: దుద్దిళ్ళ శ్రీను బాబు

నవతెలంగాణ-మంథని
భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధ్రువతార అసమాన సమాజంగా ఉన్న భారతదేశాన్ని ఒకే తాటిపై నిలిపిన మహోన్నతమైన వ్యక్తి రాజీవ్ గాంధీని, భారతదేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ నాయకులు దుద్దిల్ల.శ్రీనుబాబు అన్నారు.ఆదివారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంథని మండల మున్సిపల్ అధ్యక్షులు సేగ్గం.రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్థంతి సందర్భంగా ముఖ్య అతిథిగా దుద్దిళ్ళశ్రీనుబాబు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం శీను బాబు మాట్లాడుతూఆధునిక భావాలు కలిగిన వ్యక్తిగా,అంతర్జాతీయంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో సుస్థిర స్థానాన్ని రాజీవ్ గాంధీ సంపాదించుకున్నారన్నారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉండాలని సిడాట్ అనే కార్యక్రమం ద్వారా టెలిఫోన్ ను గ్రామాల్లో ఉన్న ప్రజలు ఉపయోగించే విధంగా కృషిచేసిన గొప్ప వ్యక్తున్నారు.మన దేశ చరిత్రలో అందరి కంటే తక్కువ వయస్సులో 40 సంవత్సరాలకే ప్రధాని పీఠాన్ని అధిష్టించి రికార్డు నెలకొల్పారనీ ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదుల చేతుల్లో రాజీవ్ గాంధీ మరణించడం దురదృష్టకరమని,కాంగ్రెస్ పార్టీ త్యాగధనుల పార్టనీ,ప్రజలకు మేలు చేయాలని తపన ఉన్నా కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం అన్నారు రాజీవ్ గాంధీ ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీను బాబు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,సీనియర్ కాంగ్రెస్ యూత్, కాంగ్రెస్ అన్ని విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.