నవతెలంగాణాముత్తారం: ముత్తారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు జన్మదిన వేడుకలను యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బియ్యని శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, నోట్ బుక్స్, పెన్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ జడ్పిటిసి నాగినేని జగన్ మోహన్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ పాల్గని వాటిని విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు వాజీద్ పాషా, బిసి సెల్ మండల అధ్యక్షులు అల్లం కుమారస్వామి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గాదం శ్రీనివాస్, సీనియర్ నాయకులు బుచ్చం రావు, బక్కతట్ల కుమార్,ఆనంద్, లక్ష్మన్, విజయ్, రత్నాకర్, కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గన్నారు.