భారీ మెజార్టీతో దుద్దిళ్ల గెలువాలని ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు 

నవతెలంగాణ- మల్హర్ రావు
 మంథని ఎమ్మెల్యేగా జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ మేనిపేస్టో చైర్మన్, మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ భారీ మెజార్టీతో మంథని నియోజకవర్గ చరిత్రలో 5వ సారి ఎమ్మెల్యేగా గెలువాలని మాజీ జెడ్పిటిసి,మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, ప్రధాన కార్యదర్శి, కొండంపేట ఎంపిటిసి సభ్యురాలు ఏనుగు నాగరాని ఆధ్వర్యంలో ధన్వాడలోని దత్తశ్రేయ,కొయ్యుర్ లోని నాగులమ్మ ఆలయాల్లో శనివారం ప్రత్యేకంగా పూజలు, అర్చనలు,అభిషేకాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడారు శ్రీదర్ బాబు 50 వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది,రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కొయ్యుర్ గ్రామశాఖ  మహిళ అధ్యక్షురాలు గుంటి సమ్మక్క,ఉపాధ్యక్షురాలు వేల్పుల రజిత వల్లెంకుంట గ్రామశాఖ  మహిళ అధ్యక్షురాలు ఎడ్ల పొసక్క, ఉపాధ్యక్షురాలు వేల్పుల కమల,మహిళ నాయకులు కొండ రాజమ్మ, ఎడ్ల లక్ష్మీ, వేల్పుల తులుషా, గడ్డం సునీత నాయకులు నార రామచంద్రం, కోడిపెళ్లి సమ్మయ్య, వేల్పుల వెంకటస్వామి, గడిపెళ్లి సదు, కొండ రమేష్, గడ్డం హరీష్ పాల్గొన్నారు.