మందకృష్ణ మాదిగ పోరాటం వల్లనే దివ్యాంగులకు ఒక వెయ్యి పెన్షన్ పెంపు…

– మద్నూర్ లో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలభిషేకం
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గురువారం నాడు ఎం ఎస్ పి ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలభిషేక కార్యక్రమాన్ని ఎంఎస్పి స్టేట్ లీడర్ కర్రెవార్ బాలు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం అనే నినాదంతో భారతదేశంలో ఎవరికి ఆపద వచ్చిన వాళ్ల తరఫునుంచి పోరాటం చేస్తూ కనబడుతున్నది గత మూడు దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగనే అలాగే ఆనాడు దివ్యాంగులకు 200 రూపాయలు పెన్షన్ ఉన్నప్పుడు దివ్యాంగుల కష్టాలు బాధలు ఎవరు పట్టించుకోని స్థితిలో వాళ్లకు సరైన గౌరవం దక్కని సమయంలో మందకృష్ణ మాదిగ దివ్యాంగుల కోసం వాళ్ళ తరఫునుంచి పోరాటం చేసి వాళ్లకి 3016 రూపాయలు పెంచాలనే డిమాండ్ ప్రభుత్వంపై పోరాటం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు 3016 రూపాయల పెన్షన్ అమలు పరిచిందని కొనియాడారు మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా దివ్యాంగులు 3016 రూపాయలు రావడం జరుగుతుందని తెలిపారు అలాగే ఈ దశాబ్ద కాలంలో మనం చూస్తే నిత్యవసర ధరలు పెరిగాయి రాజకీయ నాయకుల జీతాలు ప్రభుత్వ అధికారుల జీతాలు పెరిగాయి వాళ్ల జీతాలు నిత్యావసర వనరులు పెరిగినప్పుడు దివ్యాంగుల పెన్షన్ కూడా 6000 పెంచాలని ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొన్ని సంవత్సరాలుగా అన్న డిమాండ్ పెట్టడం జరిగింది. ఆ డిమాండ్ లో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ దిగివచ్చి 4016 రూపాయలు పెంచడం జరిగింది. ఇది మందకృష్ణ మాదిగ పోరాటం వల్లనే సాధ్యమైంది కానీ ఈ నాలుగు వేల 16 రూపాయలు వాళ్లకు సరిపోవు 6వేల పెంచాలని పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమంలో వికలాంగులు సోన్టుకేవార్ లక్ష్మణ్ ,ద్యపుర్వర్ రమేష్ ,పాకల్ సాయిలు, ఎమ్మార్పీఎస్ నాయకులు కోలావర్ పండరీ మాదిగ. కర్రెవార్ మారుతి మాదిగ గడ్డం వారి యాదరావు మాదిగ హాల్దే రాజేందర్ కర్రేవార్ లాలూ కర్రేవార్ చందు గడ్డంవార్ సంతోష్ కర్రేవార్ తుకారాం కర్రేవార్ రామ్ కాంబ్లే సంతోష్ గొంటేవార్ నగేష్ గడ్డంవార్ బాలాజీ గడ్డంవార్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.