– బోరున విలపించిన ఆదివాసి గిరిజన రైతు
నవతెలంగాణ – తాడ్వాయి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని పంభాపూర్ గ్రామానికి చెందిన నాలి సమ్మయ్య అనే ఆదివాసి గిరిజన రైతు కు చెందిన దుక్కిటెద్దు పంభాపూర్ లోని శివాలయం వద్ద ఉన్నటువంటి మినీ ట్రాన్స్ఫార్మర్ కి తాకి మంగళవారం రాత్రి సుమారు 11.00 గంటల ప్రాంతంలో దుక్కిటేద్దు మృతి చెందింది. వర్షాకాలం నెత్తిమీదికి రావడంతో, ఇప్పుడే దుక్కిటెద్దు మృతి చెందడంతో ఆదివాసి రైతు బోరున విలపించాడు. ఈ దుక్కిటెద్దు సుమారు 40 వేలు విలువచేస్తుంది. ఈ నిరుపేద ఆదివాసి గిరిజన రైతుకు ఆర్థిక సాయం అందించి తన వ్యవసాయానికి తోడ్పడాలని అధికారులను వేడుకుంటున్నాడు. కాగా ఆదివాసి గిరిజన సంఘాలు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి నాలి సమ్మయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.