కరెంట్ షాక్ తో దుక్కిటేద్దు మృతి

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మండలంలోని కిషన్ రావుపల్లి గ్రామానికి చెందిన బియ్యని రామయ్య అనే రైతుకు చెందిన రూ.60 వేల విలువగల దుక్కిటేద్దు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎద్దు యజమాని, గ్రామస్తులు పూర్తి కథనం ప్రకారం మంగళవారం ఉదయం ఎద్దును మేతకోసం విడిసిపెట్టినట్లుగా తెలిపారు. ఎద్దు మేసుకుంటు ఉరుప్రక్కనున్న  పొలాల్లోకి వెల్లిందన్నారు.పొలాల్లో  కంచెలేకుండా ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ పార్మర్ మెయిన్ కరెంట్ తిగకు తగలడంతో ఎద్దు అక్కడికక్కడే మృతిచెందినట్లుగా తెలిపారు. అసలే ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ప్రారభం నేపధ్యంలో ఒకవైపు దుక్కులు దున్నడానికి సన్నద్ధం కావడం, మరొక్క ఎద్దు చనిపోయి,మరో ఎద్దును కొనే స్తోమత లేకపోవడంతో రైతు కన్నీరుమున్నీరైయ్యాడు.ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు ఆర్థికంగా అందుకోవాలని బాధిత కుటుంబం వేడుకొంటోంది.