
– ఇబ్బందులకు గురైతున్న సామాన్యులు
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని మొలగరా దుందుభి నదిలో ఇసుక లీలలు జోరందుకున్నాయి.పేదోళ్ల ఇంటి నిర్మాణానికి ఇసుక కావాలంటే సవాలక్ష కొర్రీలు అదే డబ్బునోళ్ళకైతే నిలబడి నీళ్లు తగినంత సులువుగా పర్మిషన్లు అదే వెనువెంటే బండెనుక బండిగా లారీల లైన్ల దారులు కడుతున్నాయి. ప్రశ్నించే నోళ్లు మూగబోయాయి ఎదిరించే వాళ్ళు గమ్మునయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతలు పట్టింపు లేదు అధికారుల పర్యవేక్షణ లేదు వెరసి అక్రమ వ్యాపారం చేసేవాళ్లకు మూడు పువ్వులు ఆరు కాయలు అనే చందంగా వ్యాపారం కొనసాగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.సామాన్య ప్రజలకు ఇసుక అవసరం ఐతే పర్మిషన్స్ ఇవ్వని అధికారులు లారీలకు ఎలా పర్మిషన్లు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.పేదోళ్లకు ఒక న్యాయం..? బలిసినోళ్ళకు మరో న్యాయమా..? అంటూ మండిపడితున్నారు. దుందుభి నదిలో పెద్ద పెద్ద యంత్రాలతో కోట్ల అక్రమ వ్యాపారం సాగుతుందన్నారు.వాల్టా చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే తరుణంలో మొలగర కాజ్వే వద్ద శుక్రవారం ఓ ఆసక్తికరమైన సంఘటన వెలుగు కెమెరాకు చిక్కింది మామిళ్లపల్లి గ్రామానికి చెందిన మాడ్గుల పర్వతాలు కుటుంబ సభ్యులు మండుటెండలో సిమెంట్ బస్తాల్లో ఇసుకను నింపుకొని అతి కష్టం మీద ఆయాసపడుతూ అటోలోకి ఇసుక బస్తాలు మోసుకుంటున్నారు.వారిని వెంటనే వెలుగు రిపోర్టర్ పలకరించి విషయంపై ఆరా తియ్యగా ట్రాక్టర్ల ద్వారా తరలించడానికి పర్మిషన్ లేదంట అందుకే ఇలా కుటుంబ సభ్యులతో కలిసి కష్టంఐనా ఇసుకను మోసుకొని ఆటోలో తరలిస్తున్నాం అని సమాధానం ఇచ్చారు.ఓ వైపు లారీల్లో రోజుకు టన్నుల కొద్దీ ఇసుక తరలిపోతుంటే అధికారులకు ఇబ్బందులు లేవు కానీ సామాన్యుడు మండుటెండలో చెమట చిందిస్తుంటే వాళ్లకు చూడటానికి మా కష్టం చూడముచ్చటగా ఉందయ్యా అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు,నేతలు స్పందించి డబ్బునోళ్ళకు కొమ్ముకాయకుండ సామాన్యులకు ఆసరాగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.

వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కిటన్నులకొద్ది అక్రమ ఇసుకను డంపులు చేసి లారీల్లో తరలిస్తుంటే కట్టడి చెయ్యాల్సిన మైనింగ్ , రెవెన్యూ శాఖ అధికారులు జాడపత్త లేరు.రోజుకు ఎన్ని క్యూబిక్ మీటర్లు తియ్యలో అనే నిబంధనలు కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్లు తోడేస్తూ లారీల్లో ఓవర్ లోడ్ తో నియోజకవర్గ వ్యాప్తంగా తరలిస్తున్నారు.దింతో అధికార యంత్రాంగం నిరుగారిపోయిందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.