లాభాల బాటలో దూపల్లి సహకార సంఘం… 

– సొసైటీ చైర్మన్ శేషు గారి భూమారెడ్డి..

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం దుపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, రైతుల సహకారంతో లాభాల బాటలో నడుస్తోందని సొసైటీ చైర్మన్ శేషు గారి భూమారెడ్డి స్పష్టం చేశారు. గురువారం సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకవర్గ సభ్యులు, రైతుల సహకారంతో బ్యాంకు బ్యాలెన్స్  25 లక్షల వరకు జమ చేయబడిందని ఆయన పేర్కొన్నారు. పాలకవర్గ సభ్యుల సహకారంతో ప్రధాన రోడ్డు పక్కన గల 6 గుంటల స్థలాన్ని కార్యాలయం కోసం కొనుగోలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. సొసైటీ నిధులతో అదనపు గిడ్డంగిని నిర్మించామన్నారు. సొసైటీ నష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకురావడానికి సంఘ సభ్యులు సహకరించాలని ఆయన అన్నారు. సొసైటీ లాభాలలోకి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పల్లె సాయిలు, ధనుర్ గంగాధర్, కోనేపల్లి రాజారెడ్డి, జి.ప్రతాపరెడ్డి, నీరడి రవికుమార్, మైని రాజ్ కుమార్, శ్రీమతి ముళ్లపూడి వరలక్ష్మి, సొసైటీ సీఈవో జీవన్ రెడ్డి, సేల్స్ మెన్ ఎల్. సాయన్న, సి .ప్రతాపరెడ్డి, అటెండర్ వై. లక్ష్మణ్, రైతులు గంగారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు బాబన్న, ఎర్ర సాయన్న, తదితరులు పాల్గొన్నారు.