– ధరణికోట నర్సింహ ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలు చాట్ల దుర్గాభవానికి రక్షణ కరువైన దృష్ట్యా ప్రభుత్వమే పూర్తి సంరక్షణ చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే కు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆయన మాట్లాడుతూ దుర్గా భవాని మానసిక వికలాంగురాలు అయినందుకు ఇటీవల ఆమె పై జరిగిన లైంగిక దాడిని గుర్తించలేకపోతుందని ఆయన అన్నారు. దుర్గా భవాని తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారని , దుర్గా భవాని ఇంటివద్ద ఒంటరిగా ఉండడం వల్ల, అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెను అత్యాచారం చేశాడని, అతనిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ ను కోరారు. దుర్గా భవాని ప్రస్తుతం సఖీ కేంద్రంలో రక్షణ పొందుతుందని, ఆమెను స్టేట్ హోం కు తరలించి పూర్తి స్థాయిలో సంరక్షణ చేయాలని ఆయన కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు మచ్చ ఉపేందర్, సింగారం రమేష్, కరుణాకర్, బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్ లు ఉన్నారు.