వార్షికోత్సవంలో పాల్గొన్న దుర్గా ప్రసాద్ స్వామీజీ

నవతెలంగాణ – తొగుట 
మండల కేంద్రంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఆదివారం పంచదశ 15వ వార్షికోత్స వం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ పాల్గొని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అంతకుముందు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీని వాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అఖిల భారత హను మాన్ దీక్ష పీఠా ధిపతులు శ్రీ శ్రీ శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ ఆశీర్వా దం తీసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు ఉన్నారు. సీతారామంజనేయ వార్షికోత్సవం లో గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.