
– అన్ని సంక్షేమ పథకాలకు 5315 కోట్ల నిధులు,
మూడుసార్లు నియోజకవర్గ ప్రజలు తనకు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు ఈసారి గెలిపించండి మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని అభివృద్ధికి బాట వేస్తా,
సీతారాములకు ఆంజనేయులు గుండెల్లో పెట్టుకుంటారు నేను కూడా పురుషులంటే రాములు మహిళలంటే సీత మీ అందరిని హనుమంతునిగా గుండెల్లో పెట్టుకొని సహకరిస్తా.
ప్రతి ఒక్కరూ 10 మంది చొప్పున ఓట్లు వేయించే విధంగా కృషి చేయండి కార్యకర్తలకు ఎమ్మెల్యే హితహూ, మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నవతెలంగాణ -మద్నూర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని జుక్కల్ ఎమ్మెల్యే హనమంతు సిండే అన్నారు జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, డోంగ్లి, ఉమ్మడి మండలాలకు చెందిన కార్యకర్తల సమావేశాన్ని మద్నూర్ మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో సోమవారం నిర్వహించారు కార్యకర్తల సమావేశానికి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే ముఖ్య అతిథిగా హాజరుకాగా ఎమ్మెల్యేకు వందలాది వాహనాల్లో పెద్ద ఎక్లారా గేటు వద్ద వందల సంఖ్యలో ఘన స్వాగతం పలికారు అక్కడి నుండి ర్యాలీగా మద్నూర్ మండల కేంద్రానికి చేరుకొని గాంధీ చౌక్ ఆవరణంలో గల గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పూల మాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం గురు ఫంక్షన్ హాల్ లో కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయంలో పథకం లేని ఇల్లు లేదని పేర్కొన్నారు గడిచిన పది సంవత్సరాలు కాలంలో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి ఐదువేల 315 కోట్ల నిధులు ఖర్చు పెట్టడం జరిగిందని తెలియజేశారు ముచ్చటగా మూడుసార్లు జుక్కల్ నియోజకవర్గ ప్రజలు తనకు గుండెల్లో పెట్టుకొని గెలిపించారని ఈసారి జరిగే ఎన్నికల్లో తనని గెలిపించండి ప్రజలను నా గుండెల్లో పెట్టుకొని అభివృద్ధికి బాట వేస్తానని తెలిపారు నియోజకవర్గంలో మొత్తం 35 వేల మందికి పెన్షన్లు అందించడం జరుగుతుందని రైతు బంధు కింద నియోజకవర్గంలో 80 వేల మందికి రైతుబంధు అందించడం జరుగుతుందని వీరికి ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు రైతు బీమా కింద ఇప్పటివరకు రైతులు చనిపోతే ప్రతి కుటుంబానికి 5 లక్షల చొప్పున నియోజకవర్గంలో 16 వందల అరవై ఏడు మందికి అందించడం జరిగిందని ప్రతి ఇంటి మహిళా సంతోషంగా ఉండాలని ఆలోచనతో ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని ఆడ బిడ్డకు కడుపు బండి పిల్లలకు జన్మనిస్తే మోగ బిడ్డ పుడితే 12000 ఆడబిడ్డ పుడితే 13000 డిలవరి కోసం 102 వాహనం ఏర్పాటు కేసీఆర్ కిట్టు కింద 23,000 మందికి నియోజకవర్గంలో ఇవ్వడం జరిగిందని న్యూట్రిన్ పథకం కింద 3000 మందికి ఇవ్వడం జరిగిందని పేద ప్రజలు కడుపు నిండా తినే విధంగా ప్రతి ఒక్కరికి ప్రతినెల 6 కిలోల చొప్పున బియ్యం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద నియోజకవర్గంలో మొత్తం 12,000 మందికి 1, లక్ష 116 రూపాయల చొప్పున అందించామని తెలిపారు ఈ విధంగా జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో ఎంతో కృషి జరిగిందని తెలిపారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త 10 ఓట్లు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని కోరారు కార్యకర్తల సమావేశానికి డోంగ్లి మద్నూర్ మండలాల నుండి వేలాదిగా తరలివచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు ఆయన పేరుపేరునా అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సురేష్ ఉపాధ్యక్షులు షేక్ గఫర్ ఇరు మండలాల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ శశాంక్ పటేల్ మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మాజీ చైర్మన్ పాకాల విజయ్ పండిత్రావ్ పటేల్ ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్ మాజీ జెడ్పిటిసి సభ్యులు బసవరాజ్ పటేల్ ఇరు మండలాలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.