బీఆర్‌ఎస్‌ హయంలోనే పేదలకు మేలు

– ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్‌ యాదవ్‌ను మరోసారి ఆశీర్వదించండి
– మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌, జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్‌
నవతెలంగాణ-తలకొండపల్లి
బీఆర్‌ఎస్‌ హాయంలోనే పేదలకు మేలు జరుగుతుందని మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌, జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు శ్రీనివాస్‌ యా దవ్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వెంట్రావుపేటలో సర్పంచులు అలివేలు, జిర్య నాయక్‌, హైమావతి రమేష్‌, ఎంపీటీసీ సరిత గణేష్‌ గుప్తా ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి తెలుసుకోవాలన్నారు. గతంలో ఎన్నికల ముందు ప్రకటించిన పథకాలే కాకుండా కొత్త పథకాలు ప్రకటించి పేదలకు సీఎం కేసీఆర్‌ మేలు చేశారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరాయన్నారు. ఇప్పుడు మళ్లీ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన పథకాలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆమనగల్‌ మార్కెట్‌ చైర్మన్‌ నల్లపూరం శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్‌, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు గోపాల్‌ నాయక్‌, వివిధ గ్రామాల సర్పంచులు ఈశ్వర్‌ నాయక్‌, చంద్రయ్య, లక్ష్మణ్‌ నాయక్‌, కిషన్‌ నాయక్‌, ఎంపిటిసిలు రామస్వామి, మండలాధ్యక్షులు కుమ్మరి శంకర్‌,సీనియర్‌ నాయకులు దశరథ్‌ నాయక్‌, రైతు సమన్వయ అధ్యక్షులు నర్సింహా, బీఆర్‌ఎస్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ రమేష్‌ నాయక్‌, కోఆప్షన్‌ సభ్యులు ఇమ్రాన్‌,ఉప సర్పంచ్‌ పద్మ గరుసింగ్‌, నరేష్‌ రాజు, సింగల్‌ విండో డైరెక్టర్లు శేఖర్‌ యాదవ్‌, శేఖర్‌. మండల ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షులు దరువుల అశోక్‌, గ్రామ కమిటీ అధ్యక్షుడు. రాజు , గోపీ నాయక్‌, నాయకులు జంగయ్య, రాఘవేందర్‌, శ్రీను, మల్లేష్‌, శేఖర్‌, మల్లయ్య, శంకర్‌, యువకులు, గ్రామస్తులు మహిళా తదితరులు పాల్గొన్నారు.