క్రికెట్‌ టోర్నీ విజేతగా ‘ తలుపునూరు ‘

నవతెలంగాణ – రెవల్లి
తలుపునూరు గ్రామ క్రికెట్‌ టీం యూత్‌ క్రీడాకారులు శనివారం గుడిపల్లి గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ లో గుడిపల్లి తలుపునూరు టీం లు ఆడగా, తలుపునూరు గ్రామానికి చెందిన క్రికెట్‌ టీం 67 రన్‌ పరుగులు చేశారు. రొండు ఇన్నింగ్‌ ప్రారంభించిన గుడిపల్లి టీం 47 పరుగులు చేసింది. దీంతో తలుపునూరు జట్టు 20 పరుగులతో విజయం సాధించింది. గుడిపల్లి గ్రామ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వాహకుడు రామస్వామి మొదటి విజేతలకు రూ. 12వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందజేశారు, రెండవ విజేత గుడిపల్లికి 8000 నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందించారు. కార్యక్రమంలో క్రీడాకారులు ఆల్తాఫ్‌, గౌతమ్‌, భాస్కర్‌, ఇలియాస్‌, మిల్ట్‌ ఆప్రూ, నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.