డస్ట్‌ అలర్జీతో బాధపడుతున్నారా.?

ప్రస్తుతం డస్ట్‌ అలర్జీ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్న దుమ్ముకే తుమ్ములు రావడం, ముక్కు కారడం, కళ్లలో దురద, కళ్లుప్రస్తుతం డస్ట్‌ అలర్జీ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్న దుమ్ముకే తుమ్ములు రావడం, ముక్కు కారడం, కళ్లలో దురద, కళ్లు ఎర్రబడడం, గొంతులో నొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువతున్నాయి. వాయు కాలుష్యం కూడా డస్ట్‌ అలర్జీకి దారి తీస్తుంది.
ఒక్కసారి డస్ట్‌ ఎలర్జీ అటాక్‌ అయ్యిందంటే తగ్గడం సులువుకాదు. ఎన్నో రకాల మందులు వాడాల్సి ఉంటుంది. అయితే డస్ట్‌ అలర్జీని కొన్నిరకాల నేచురల్‌ టిప్స్‌ ద్వారా చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గని డస్ట్‌ అలర్జీని కొన్ని రకాల వంటింటి చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ నేచురల్‌ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డస్ట్‌ అలర్జీని చెక్‌ పెట్టడంలో రాక్‌సాల్ట్‌ బాగా ఉపయోగపడుతుంది. ఒక కప్పు వేడి నీటిలో రాక్‌ సాల్ట్‌ను కరిగించి ఆ నీటిని ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల ముక్కు క్లీన్‌ అవుతుంది. గొంతు నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దుమ్ము, బ్యాక్టీరియా నాశనం అవుతుంది.
డస్ట్‌ అలర్జీ ఉన్న వారికి అల్లం, తేనె కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండింటిలో ఉండే నేచురల్‌ యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డస్ట్‌ అలర్జీని దూరం చేస్తుంది. ఒక చెంచా తేనెలో అల్లం రసం కలిపి ప్రతీరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే డస్ట్‌ అలర్జీ దూరమవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
శీతాకాలంలో డస్ట్‌ అలర్జీ మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి సమయంలో పసుపు, తులసి ఆకులు క్రీయాశీకలంగా ఉపయోగపడతాయి. తులసి ఆకులను ఉడకబెట్టి, అందులో పసుపు వేయాలి. అనంతరం నీరు సగం అయ్యే వరకు వేడి చెయ్యాలి. గోరు వెచ్చగా చేసుకొని ఈ నీటిని తాగాలి. ఇది శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది.
రాత్రి పడుకునే ముందే కొబ్బరి నూనె మసాజ్‌ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ముక్కు, గొంతు దగ్గర కొబ్బరి నూనెను మసాజ్‌ చేయాలి. దీనితో శ్వాస తీసుకోవడంలో తలెత్తే ఇబ్బందుల నుంచి ఉపశనం లభిస్తుంది.