– లారీలను ఆపి నిరసన తెలిపన వీణవంక సర్పంచ్ కుమారస్వామ
నవతెలంగాణ-వీణవంక
మండలంలోని మానేరు తీరం వెంట నడుస్తున్న ఇసుక లారీలు అధిక లోడుతో వెల్లడం వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయని, దుమ్ము లేస్తోందని వీణవంక సర్పంచ్ నీల కుమారస్వామి ఆరోపించారు. వాటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయన గ్రామస్తులతో కలిసి మండల కేంద్రంలో ఇసుక లారీలను ఆపి సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక లారీలను నిబంధనలకు విరుద్ధంగా నడపడం వల్ల రోడ్లు అన్ని ధ్వంసమవుతున్నాయని ఆరోపించారు. లారీలో ఓవర్ స్పీడ్తో వెల్లడం వల్ల దుమ్ము లేచి పలువురు అనారోగ్యపాలవుతున్నారని వాపోయారు. విషయం తెలుసుకున్న క్వారీల యజమానులు రోడ్లపై ట్యాంకర్ల ద్వారా దుమ్ము లేవకుండా నీళ్లు పోస్తామని హామీ ఇవ్వడంతో సర్పంచ్ కుమారస్వామి ఆందోళన విరమించారు