కోల్‌కత : ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ మరో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన డచ్.. ఈడెన్‌గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. తొలుత 229 పరుగులు చేసిన నెదర్లాండ్స్.. ఛేదనలో బంగ్లాదేశ్‌ను 142 పరుగులకే కుప్పకూల్చింది. 87 పరుగుల తేడాతో గ్రూప్ దశలో రెండో విజయం అందుకుంది. స్కాట్ ఎడ్వర్డ్స్ (68), వెస్లీ బారెసి (41), సైబ్రాండ్ (35)లు డచ్‌కు మంచి స్కోరు అందించారు. పాల్ వాన్ మీకెరన్ (4/23), లీడె (2/25) నిప్పులు చెరుగగా బంగ్లాదేశ్ 42.2 ఓవర్లలోనే చేతులెత్తేసింది. బంగ్లా తరఫున మెహిది (35), మహ్మదుల్లా (20), ముస్తాఫిజుర్ (20) పరుగులు చేశారు.