నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని డిడబ్ల్యుడిఓ నరసింహారావు, సిడిపిఓ శైలజతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్న పోషక ఆహార మెనూ పరిశీలించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు యూనిఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుధా రమణ, ఏ డబ్ల్యు టి ఎస్ పద్మలు పాల్గొన్నారు.