నవతెలంగాణ-నవీపేట్: బీజేపీ మండల అధ్యక్షుడిగా నాలేశ్వర్ సర్పంచ్ ద్యాగ సరీన్ ను జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీనారాయణ సోమవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సరీన్ మాట్లాడుతూ.. మండలంలో బీజేపీ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జిల్లా పార్టీ నాయకత్వానికి, నియోజకవర్గ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.