భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయ మహాసభలు నవంబర్ 10, 11 తేదీలలో వలిగొండ పట్టణ కేంద్రంలోని శివశక్తి ఫంక్షన్ హాల్ లో జరుగుతున్నాయని డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు దయ్యాల మల్లేష్ తెలిపారు. గురువారం అనాజిపురం గ్రామంలో మహాసభల కరపత్రం ఆవిష్కరణ నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ .. వలిగొండ మండల కేంద్రంలో డివైఎఫ్ఐ జిల్లా ద్వితీయ మహాసభలు రెండు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం యువతకు అనేక హామీలు ఇచ్చి ఇచ్చిన మాట మీద నిలబడలేక నిరుద్యోగ యువతను మోసం చేయడం మొదటి పనిగా పెట్టుకుందని అన్నారు. మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా పేరుతో యువత ఉపాధి కల్పిస్తామని చెప్పి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అనే మాట ఊసే లేకుండా బిజెపి ప్రభుత్వ పరిపాలన ఉందని అన్నారు. నిరుద్యోగాన్ని, నిరుద్యోగ శాతాన్ని తగ్గించడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు అడపతడప అమలు జరుపుతున్న రంగారెడ్డి జిల్లాలో ఇచ్చిన యూత్ డిక్లరేషన్ మాత్రం అమలు చేసిన పరిస్థితి లేదని విమర్శించారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ అవలంబించిన విధానాలు అవలంబిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ పట్టిన గతే పడుతుంది అన్నారు. ఈ నేపథ్యంలో యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తూ ఎప్పటికప్పుడు నిరుద్యోగ విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుండే డివైఎఫ్ఐ జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లాపురం మాజీ మండల కార్యదర్శి ఏదూనూరి వెంకటేష్, గంగదారి వెంకటేష్, ఎండి రఫీక్, మైలారం శివ, బొల్లెపల్లి ప్రవీణ్, గంగదారి గణేష్, భానుప్రకాష్, బొల్లెపల్లి ప్రణయ్, చందు, సిద్దు, కరీం లు పాల్గొన్నారు.