– రాజకీయ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న డీవైఎఫ్‌ఐ నాయకులు
నవతెలంగాణ-ఆమనగల్
ఉపాధి కల్పనతోనే దేశాభివృద్ధి సాధ్యమని డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు పిప్పళ్ళ శివశంకర్ అన్నారు. హన్మకొండ పట్టణంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 3 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో పూర్వపు సమితి పరిధి లోని ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల, మండలాలకు చెందిన డీవైఎఫ్‌ఐ నాయకులు పాల్గొ న్నట్టు జిల్లా ఉపాధ్యక్షులు పిప్పళ్ళ శివశంకర్ తెలి పారు. ఈ సందర్భంగా ఆయన నవతెలంగాణతో మాట్లాడారు. శిక్షణా తరగతుల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ విద్యా, ఉపాధి అవకా శాలు కల్పించే విధంగా డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేప ట్టే పోరాటాల కార్యాచరణను రూపొందించినట్టు చెప్పారు. రాజకీయ లబ్దికోసం కుల, మత, జాతి పేరుతో తప్పుదోవ పట్టిస్తున్న యువతను మేల్కొ లిపి కేంద్ర, రాష్ట్ర పరిధిలో ఖాలీగా ఉన్న ఉద్యోగా లను భర్తీ చేయాలని డిమాండు చేస్తూ ఆందోళనలు చేపట్టేందుకు రాష్ట్ర కమిటీ ప్రణాళికలు రూపొందిం చినట్టు శివశంకర్ తెలిపారు. శిక్షణా తరగతుల్లో ఆ మనగల్ డీవైఎఫ్‌ఐ నాయకులు క్రిష్ణ, వినోద్, అరు ణ్, పవన్, భాస్కర్, గణేష్, శివ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.