సార్వత్రిక బంద్ కు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు

– గడ్డం వెంకటేష్ (డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి)
నవతెలంగాణ  – భువనగిరి
కేంద్ర బీజేపీ ప్రభుత్వం మతతత్వ కార్పొరేట్ విధానాలు వ్యతిరేకిస్తూ 16న శుక్రవారం జరిగే సార్వత్రిక బంద్ కు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు అని ఈ బంద్ లో నిరుద్యోగ యువత అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్  బుధవారం ఒక ప్రకటన విజ్ఞప్తి చేశారు. బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాలు కాలంలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగులని మోసం చేసిందన్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందని ఆయన ఆరోపించారు దేశంలో ఇప్పటివరకు ఎన్నడు లేని విధంగా నిరుద్యోగం బాగా పెరిగిందని ఆయన తెలిపారు. దేశంలో ఒకపక్క నిరుద్యోగం పెరుగుతూ ఉంటే మరోపక్క ధరలు విపరీతంగా పెంచి ప్రజల పైన భారాలు వేస్తూ పెద్దపెద్ద కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చే విధంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన విమర్శించారు. ఈ విధానాలన్నీ దేశ ప్రజలు వ్యతిరేకించాలని  శుక్రవారం జరిగి సార్వత్రిక బంద్ లో ప్రజానీకం నిరుద్యోగులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.