డివైఎఫ్ఐ రోటరీ నగర్ ఏరియా కమిటీ ఎన్నిక..

DYFI Rotary Nagar Area Committee Election..– నిరుద్యోగుల సమస్యలను అధికార కాంగ్రెస్ పరిష్కరించాలి

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) రోటరీ నగర్ ఏరియా కమిటీ పదిమంది సభ్యులతో ఆదివారం కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ నిరుద్యోగుల సమస్యల పైన అనేక పోరాటాలు చేసే ఏకైక సంఘం డివైఎఫ్ఐ అని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు నీళ్లు నిధులు నియామకాల పేరుతో సాగిందని గత టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో యువతను అణిచి వేయడంతో ప్రభుత్వానికి నిరుద్యోగులు బుద్ధి చెప్పారని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నిరుద్యోగుల సమస్యలను దాంతోపాటు వార్షిక జాబ్ క్యాలెండర్ ని తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీనీ వెంటనే కనీసం 3000 రూపాయలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధిని కల్పించాలి. లేకపోతే భవిష్యత్తులో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు నల్వల నర్సయ్య , సతీష్ రోటరీ నగర్ ఏరియా కార్యదర్శిగా, సాయికుమార్ అధ్యక్షులుగా, కృష్ణ, దుర్గాప్రసాద్, నవనీష్, రాజ్ కుమార్, కార్తీక్, మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.