నిరుద్యోగ యువకులకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలి: డివైఎఫ్ఐ

నవతెలంగాణ – వలిగొండ రూరల్ 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి పొందేందుకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలి అని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్,జిల్లా ఉపాధ్యక్షులు కవిడే సురేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున మండలకేంద్రం,గోకారం,జాలుకలువ గ్రామాలలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యూత్ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానల్లో భాగంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ,నేటి కాంగ్రెస్ ప్రభుత్వం గాని యువకులకు అనేక హామీలు ఇచ్చినప్పటికి ఏ ఒక్కటి అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తూ ఎన్నికల్లో పావులుగా వాడుకుంటున్నారని అన్నారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని కనీసం వారు స్వయం ఉపాధి కొరకు చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడం కోసమైనా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అలా చేయకపోవడం వలన యువకులు పెడ ధోరణి లో వెళ్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో అనేక ప్రాంతాల్లో కెమికల్,ఇతర పరిశ్రమలు ఉన్నపటికీ స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పించకుండా ఇతర రాష్ట్రాల వారిని పెట్టుకుంటున్నారని అందువల్ల కాలుష్యం ఏమో ఈ ప్రాంత ప్రజలు అనుభవించాల్సి వస్తుంది స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని,డిగ్రీ,పీజీ లు చదివిన అనేక మంది యువకులు మెకానిక్, వ్యవసాయ పనులు,చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు ధ్యానబోయిన యాదగిరి,దేశపాక బాబు,రవి,జరుగుమల్ల శ్రీకాంత్,ఆకుల రాజు,రాపోలు నవీన్,ఆనగంటి గణేష్,చెర్క బాలరాజు,శనిగారపు పరమేష్,ఐతర్జు వెంకటేష్,కొరగోని రాజు,నల్లగంటి మల్లేష్,భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.