నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో డివైఎఫ్ఐ జిల్లా మహాసభల కరపత్రాలను ఆవిష్కరిస్తూ మాట్లాడుతూ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకృష్ణ రాష్ట్ర ప్రభుత్వన్ని మంగళవారం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో యువతను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మోసగిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని హమీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం గడుస్తున్నా హామీ నెరవేర్చలేదని అన్నారు.ఈనెల 10,11 తేదీలలో వలిగొండ పట్టణంలో డివైఎఫ్ఐ ద్వితీయ జిల్లా మహాసభలు జరుగుతాయని,ఈ మహాసభలకు 600 యువత హాజరవుతా ఉన్నారని,విద్య ఉపాధి అవకాశాలకై ఉద్యమ కార్యచరణ రూపొందుతుందని అన్నారు.ఉపాధి అవకాశల కోసం ఉద్యమించాలని అన్నారు. జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు బోదాస్ నరేష్, పల్లె శివకుమార్ ,నాయకులు దొడ్డి లింగస్వామి,బోదాసు వెంకటేశం,బోడిగే సైదులు,వనం విజయ్ కుమార్,పల్లె అనిల్ కుమార్,పాలమాకుల రాకేష్,గంగాదేవి లింగస్వామి,మాదాగోని లింగస్వామి,మనీ తదితరులు పాల్గొన్నారు.