నవతెలంగాణ – భువనగిరి
తాను మరణించి మరోకరికి కనుచుపు ప్రసాధించారు. భువనగిరి మండలం మన్నేవారిపంపు గ్రామానికి చెందిన గుండ్ల ఎల్లారెడ్డి(68) ద్విచక్ర వాహనంపై శనివారం భువనగిరి పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వైపు వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనాన్ని ఇదే మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి డీ కొట్టింది. దీంతో ఎల్లారెడ్డి తలకి బలమైన గాయాలు కాగా 108లో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మేరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లో నీ గాంధీ దవాఖానకు తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుండ్ల ఎల్లారెడ్డి కండ్లను హైదరాబాదులోని ఎల్వి ప్రసాద్ కంటి దవాఖానకు అప్పగించాలని దవాఖానా ప్రతినిధులు, కుటుంబ సభ్యులను సూచించారు. అంగించినన కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు కండ్లు అప్పగింత…. ఈ మేరకు కుమారుడు గుండ్ల నర్సిరెడ్డి కోడలు మంజుల తోపాటు కూతురు మనమడులా సహకారంతో దవాఖానకు కనులను అందజేశారు. గత కొన్ని సంవత్సరాల క్రితమే అంతని భార్య గుండ్ల యాదమ్మ అనారోగ్యంతో మృతి కాగా ఈ నెల 9వ తేదిన స్వంగ్రమంలో అత్యక్రియాలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు కుమారుడు గుండ్ల నర్సిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్త ఎస్‌ఐ కుమారస్వామి కేసు నమోదు చేశారు.