నిర్వీర్యం అవుతున్న విద్యావిధానం

Dying education system– ఒక్కటొక్కటిగా మూత పడుతున్న ప్రభుత్వ పాఠశాలలు
– మూత పడిన నాయిన వానికుంట తండా పాఠశాల
–  ఇప్పటికి 18 పాఠశాలలకు తాళాలు
– 12 గురిజన తండాల పాఠశాలలు మూత
నవతెలంగాణ – పెద్దవూర
రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా దృష్టి సారించిందని చెప్పుకుంటున్నా ఎక్కడ కూడా ద్రుష్టి సారించినట్లు కనిపించడం లేదు. అమ్మ ఆదర్శ కమిటీలతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపతా మని 20-25 నూతన విద్యా సంవత్సరంలో మూతబడిన బడులను తెరిపించేందుకు క్షేత్ర స్థాయిలో జాబితా సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.కానీ మూతపడిన పాఠశాలలు ఏ ఒక్క పాఠశాల ను కూడా విద్యాధికారులు తెరిపించలేక విఫలం అయ్యారని మండలం లో చర్చ జరుగుతుంది.పెద్దవూర మండలం వ్యాప్తంగా మొత్తం 68 పాఠశాల లు ఉండగా అందులో ఉన్నత పాఠశాలలు 09,ప్రాథమికొన్నత పాఠశాలలు 04,ప్రాథమిక పాఠశాలలు 55 వున్నాయి.గత రెండు రోజుల క్రితం  నాయిన వాని కుంట తండాపాఠశాల మూత పడింది. ఇక్కడీ టీచర్ ను పెద్దవూరకు డిప్టేషన్ పై పంపించారు. ఈ పాఠశాల తో కలిపి 19 పాఠశాలలు ఇప్పటికి మూత పడ్డాయి.
మూత పడిన పాఠశాలలు
మూతపడిన పాఠశాలలను పరిశీలిస్తే లింగంపల్లి, మళ్ళావానికుంట తండా, ఏనేమీది తండా, చింతపల్లి తండా, గేమ్యానాయక్ తండా, రామన్న గూడెం తండా, సుద్దబాయి తండా,సాగర్లో 04 ప్రాథమిక పాఠశాలు,మర్రిపురి తండా, కోమటి కుంట తండా, రామన్నగూడెం,నాయినవాని కుంట, నాయినవాని కుంటతండా, కొత్త జయరాంతండా,పాత జయరాంతండా,  జాగ్రమ్ తండా,అందులో 12 పాఠశాలలు గిరిజన తండాలకి చెందినవే..ఇంకా నాలుగైదు పాఠశాలలు మూతకు సిద్ధంగా వున్నాయి అందులో మూడు తండాలు ఉన్నట్లు తెలుస్తుంది.పాఠశాలలు మూత పడకుండా మంచి విద్యాబోధన చేయిస్తే కొన్ని పాఠశాలలైన సజావుగా నడిచేవని,మూత పడేవి కావని గ్రామాల్లో చర్చ జరుగుతుంది. మూతపడిన పాఠశాలలు తండాలకు చెందినవి ఎక్కువగా వున్నాయి.ఈ విద్యాసంవత్సరం నాయినవాని కుంట, నాయినవానికుంట తండా, కొత్తజయరాం తండా పాతజయరాం తండా, గేమ్యానాయక్ తండా, రామన్నగూడెం,పాఠశాలలు మూత పడ్డాయి.
అసలు పెద్దవూర మండలం లో ఎం జరుగుతుంది..?
సాగర్ నియోజకవర్గం లో ఎక్కడ లేని విధంగా పెద్దవూర మండలం లోనే అతధికంగా 18 పాఠశాలు మూత పడ్డాయి.గత 05 ఏండ్లు నుంచి పర్మినెంట్ ఎంఈఓ లేక పోవడం,ఒక్కొక్క ఎంఈ ఓ మూడు నాలుగు మండలాలు, కొంతమంది ఎంఈ ఓలు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూనే మరో వైపు మూడు, నాలుగు మండలాలకు ఎంఈ ఓలుగా పనిచేస్తుండడం, పర్యవేక్షణ లేకపోవడం,గ్రామాల్లో తండాలలో విద్యావిధానం పై అవగాహన కల్పించక పోవడం, జిల్లా విద్యాశాఖాది కారుల పర్యవేక్షణ లేకపోవడం, పాఠశాలల్లో శుభ్రంచేసే వాళ్లు లేకపోవడం,కనీస మౌలిక వసతులు కల్పించక పోవడం, కొన్ని పాఠశాలలో పిచ్చి మొక్కలు తొలగించ పోవడం,ఆడుకునేందుకు ఆట వస్తువులు లేకపోవడం,పాఠశాలలో సరైన వసతులు తాగునీళ్ళు, బోధనా సిబ్బంది కొరత, ఉపాధ్యాయులు తరచూ ఆలస్యంగా విధులకు హాజరు కావడం, కొంతమంది మాత్రమే సమయపాలన పాటిస్తుండడం, తో మండలంలో పాఠశాలలు మూతపడుతున్నాయని చర్చ జరుగుతుంది.పర్మినెంట్ ఎంఈఓ ఉంటే ప్రతి రోజు పర్యవేక్షణ చేస్తుంటే ఉపాధ్యాయులు ఉత్సాహం తో విద్యాభోదన చేసేవారు. కాని పాఠశాలలను పట్టించుకునే వారే లేక మండలం విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతుందని కూడా చర్చ జరుగుతుంది. జిల్లా విద్యాశాఖాదికారులు  పర్యవేక్షణ లేక పోవడం,ఎప్పుడో చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారే తప్పు సమస్యలు పరిష్కరించడం లేదనే వాదన వినబడితుంది.ఏకోపాధ్యాయ పాఠశాలలు పరిస్థితి మరి దారుణంగా ఉంది. టీచర్ సెలవు పెడితే ఆరోజు మూతే.
అందుబాటులో లేని డిజిటల్ విద్య
ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ విద్య అందుబాటులో లేకపోవడంకారణంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. పెద్దవూర జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో గతంలో 800 మందివున్న విద్యార్థులు ఇప్పుడు 450 కి చేరింది. ప్రతిఏడాది విద్యార్థులు తగ్గిపోతున్నారు. సరైన విద్యావిధానం లేకపోవడం, పర్యవేక్షణ లోపం, వసతుల లేమి, పరిశుభ్రత వంటి లోపాలు, కొన్ని పాఠశాలల్లో ప్రదానోపాధ్యాయులే తరచూ ఆలస్యంగా రావడం,సరైన విద్యా ప్రాణాళిక అందిచక పోవడం వంటి కారణాలు కూడా విద్యార్థుల తగ్గుదలకు కారణాలవు తున్నాయి.ఇంకా రాబోయే రోజుల్లో మండలంలో ఎన్ని ప్రాథమిక పాఠశాలలు మూత పడతాయోనని చర్చ జరుగుతుంది.ప్రభుత్వం ఈసారి మూత పడిన పాఠశాలలను తెరిపిస్తామని విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని,అమ్మ ఆదర్శ కమిటీల పేరుతొ మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పింది. మౌలిక వసతులు పనులు ఇంతవరకు ఏ పాఠశాలలో కూడా పూర్తికాలేదు. కానీ ఈ పనులు విద్యార్థులు వున్న పాఠశాలల్లో పనులు జరుగ వలసి ఉండగా మూత పడిన పాఠశాలల్లో పనులు జరుగుతుందండం ఏమిటని ఆయా గ్రామాల్లో చర్చించు కుంటున్నారు.ఇప్పటికైనా ఉన్నాతాధికారులు పర్యవేక్షణచేసి ఇకపై ప్రభుత్వపాఠశాలలు మూత పడకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పుంచుటకు తల్లి దండ్రులు మొగ్గు చూపాలి…ఎంఈఓ -తరిరాము – పెద్దవూర
మండలం లో విద్యార్థులు లేక 18 పాఠశాలలు మూత పడ్డాయి. కొంతమందిని విద్యార్థులు లేక డిప్యుటేషన్పై ఇతర పాఠశాలలకు పంపించాము.గిరిజన తండాల పాఠశాల ఉండడం బాధాకరం.  వారికీ బడి బాట కార్యక్రమంలో అవగాహన కల్పించాము. అయినావారిలో మార్పు రాలేదు. ప్రయివేట్, కార్పొరేట్ కన్నా దీటుగా ప్రభుత్వపాఠశాలల్లో ప్రభుత్వం మౌళిక వసతులు కల్పింస్తున్నారు .తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలి.