ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికావద్దు : డివైఆరో నజీర్ ఖాన్

నవతెలంగాణ-సారంగాపూర్ : పెద్ద పులి సంచారం గురించి ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికావద్దు అని డివైఆరో నజీర్ ఖాన్ అన్నారు. శనివారం అడెల్లి  అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది , ప్రొటెక్షన్ వాచర్స్, టైగర్ మానిటరింగ్, అలాగే డ్రోన్ మానిటరింగ్, ఫుట్ పెట్రోలింగ్ అటవీలోని వ్యవసాయ క్షేత్రాల వెంబడి కూంబింగ్ నిర్వహించాడం జరిగిందన్నారు. పెద్ద పులికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు అగుపించలేదన్నారు. అడెల్లి తండా గ్రామంలో అవగాహన సమావేశం నిర్వహించి ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికావద్దని తండా వాసులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో అటవీ క్షేత్రస్థాయి అధికారులు ఉన్నారు.