ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న ఎంపీటీసీ సభ్యులు

– అసెంబ్లీ ఎన్నికల ముందు ముగ్గురు ఉంటే ఎన్నికల తర్వాత 9 కి చేరిన కాంగ్రెస్ ఎంపీటీసీలు

నవతెలంగాణ- మద్నూర్
పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మద్నూర్ ఉమ్మడి మండలంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు మాత్రమే మిగిలి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగీయగానే రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జుక్కల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హనుమంతు షిండే ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావును ప్రజలు గెలిపించడం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే బి ఆర్ ఎస్ పార్టీ ఎంపీటీసీలు పార్టీని మారుతూ కాంగ్రెస్ పార్టీ లోకి ఒక్కొక్కరుగా చేరుతున్నారు. ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల సంఖ్య ముగ్గురు ఉండగా బీఆర్ఎస్ పార్టీ నుండి మరో ఆరుగురు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీ ఎంపీటీసీల సంఖ్య 9 కి చేరింది మద్నూర్ ఉమ్మడి మండలంలో మొత్తం ఎంపీటీసీల సంఖ్య 17 ఉండగా అప్పట్లో కొందరు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇద్దరు ముగ్గురు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ లంతా కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరుగా చేరడం ఆ పార్టీలో మొత్తం తొమ్మిది మంది ఎంపీటీసీలు గా సంఖ్య పెరిగింది. ఇక మిగిలిన వారు ఏడుగురు వారిలో కూడా కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరెందుకు సిద్ధమవుతున్నట్లు ప్రజల్లో చర్చలు వినబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఛాయాశక్తుల కృషి చేసిన ఎంపిటిసిలు ఆ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోవడంతో ఇక అధికార పార్టీలో ఉండడమే మంచి దనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు సమక్షంలో ఎంపీటీసీలు చేరికల పర్వం కొనసాగిస్తున్నారు దీన్ని బట్టి చూస్తే ఎంపీపీ అధ్యక్ష పదవి అవిశ్వాసానికి సిద్ధం కావచ్చ నే చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ఎంపీపీ అధ్యక్ష పదవి ఎస్సీ మహిళా రిజర్వ్ గా ఉంది ఒకవేళ అవిశ్వాసం పెడితే ఎంపీపీ అధ్యక్ష పదవి కొడిచెర ఎంపీటీసీగా కొనసాగుతున్న యాదాబాయికి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయిబీఆర్ఎస్పార్టీ నుండి ఎంపీటీసీలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్లో చేరడం ఎంపీపీ పదవికి ఎసరు పెట్టే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి.