
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రతి ఒక్క వ్యక్తి పిరమిడ్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కడ్తల్ మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టు సభ్యులు దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని అమీర్ నగర్ గ్రామ శివారులోని శివగుట్ట వద్ద గల విశ్వమాత పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద పౌర్ణమి ధ్యానాన్ని ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు.ఈ పౌర్ణమి ధ్యాన కార్యక్రమానికి జ్ఞాన దాత మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టు సభ్యులు దామోదర్ రెడ్డి విచ్చేసి చాలా చక్కని ఆత్మ జ్ఞానం అందించారు.శివగుట్టపై చాలా అద్భుతమైనటువంటి ధ్యాన మందిరం నిర్మించాలని, మానవ జీవితంలో పిరమిడ్ ధ్యాన మందిరాల నిర్మాణం గొప్ప విషయమన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి పిరమిడ్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని సూచించారు.పత్రీజీ యొక్క ఆశయ సాధనలో ప్రతి ఒక్క రూపాలు పంచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన 200 మంది ధ్యానులకు ధ్యానమృతం అందించారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నల్లగంగారెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు గుండోజి నవీన్ కుమార్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ లు బొడ్డు దయానంద్, కూనింటి శేఖర్ రెడ్డి, ప్రేమ్ కుమార్ అశోక్, మురళి గౌడ్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.