– రవితేజ
రవితేజ నటించిన స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమే శ్వరన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈనెల 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. రవితేజ మాట్లాడుతూ,’నవదీప్‌కు బలమైన క్యారెక్టర్ దక్కాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో తనకి మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. ఎవరూ ఊహించలేని విధంగా డైలాగ్స్ చెప్పాడు. ఇద్దరం కలిసి ఓ కామెడీ సినిమాలో చేయాలని ఉంది. తనలో చాలా మంచి హ్యుమర్ ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకుల రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను. డైరెక్టర్ కార్తిక్‌కి విపరీతమైన క్లారిటీ ఉంది. అద్భుతంగా తీశాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి తనతోపాటు మా నిర్మాత విశ్వప్రసాద్‌కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఖచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే సినిమా ఇది. ఇదొక గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రం’ అని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని చెప్పారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ,’రవితేజకి ప్రత్యేక కతజ్ఞతలు. కొత్త దర్శకులు, నటులకు అవకాశం ఇచ్చినట్లే.. మా ప్రొడక్షన్‌కు వరుసగా మూడు సినిమాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. కార్తీక్‌తో మరో సినిమా చేస్తున్నాం. ఇదొక స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. మంచి సందేశంతో పాటు అద్భుతమైన క్లైమాక్స్ ఉంటుంది’ అని తెలిపారు. నవదీప్ మాట్లాడుతూ, ‘రవితేజ అన్నతో కలిసి పని చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది’ అని అన్నారు.