నవతెలంగాణ-చండూరు : నామినేషన్ ప్రక్రియల లో భాగంగా గురువారం మొత్తం 17 నామినేషన్లు దాకాలు చేయగా అందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు నలుగురు తమ నామినేషన్ సెట్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దామోదర్ రావుకు అందజేశారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థికోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి, సిపిఎం అభ్యర్థి దోనూరు నర్సిరెడ్డి, బీఆర్‌ఎస్ అభ్యర్థి జింకల కృష్ణ ముదిరాజులు తో పాటు మరో పదిమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.