మునుగోడులో దేశవ్యాప్త సమ్మె సక్సెస్..

నవతెలంగాణ –  మునుగోడు
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం మండల కేంద్రంలో  సీఐటీయూ ,రైతు సంఘం, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మికుల సమ్మెకు కార్మికులు రైతు సంఘం నాయకులు అధిక సంఖ్యలో హాజరై సమ్మెను సక్సెస్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం ,రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజ రామచంద్రం మాట్లాడుతూ..నరేంద్ర మోడీ అధికారం వచ్చిన 10 సంవత్సరాలలో రైతులకు ఇతర కార్మికులకు ఇబ్బంది పెట్టే కార్మిక చట్టం తీసుకొచ్చి కార్మికుల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు.  రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడానికి ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారికి ఆ బోర్డు ద్వారా పెన్షన్ రూ.10000 రూపాయలు ఇవ్వాలని భవన నిర్మాణ కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి పెన్షన్ నెలకు రూ.5000 ఇవ్వాలని ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబాలలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని రూ.10 లక్షలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని,  ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినందున ఆటో కార్మికులు పూర్తిగా నష్టపోతున్నందున వారికి నెలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని వాడి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మాజీ మండల కార్యదర్శి, మునుగోడు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న , సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మిర్యాల భరత్ ,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు సురికి చలపతి సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు బండమీది యాదయ్య మందుల పాండు , సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు యాసరాణి శ్రీను , వేముల లింగస్వామి , వీరమల్లు , సాగర్ల మల్లేష్ , అరుణ , పెద్దమ్మ , సుజాత తదితరులు ఉన్నారు.