వేములవాడలో బీఆర్ఎస్, బీజేపీ నేతల ముందస్తు అరెస్టును ఇరు పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. వేములవాడలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వేములవాడ అర్బన్ మండల మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, మాజీ సర్పంచ్ లు తదితరులను వేములవాడ పోలీసులు అరెస్టు చేసి, బోయినిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరి కొంతమందిని హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిమ్మ శెట్టి విజయ్ మాట్లాడుతూ.. ప్రజా పాలన చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా పాలన చెప్పుకునే ప్రభుత్వం ఇలా అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. ప్రశ్నించే గొంతకలను నొక్కాలని చూస్తున్నారని తెలిపారు. ఉదయం నాలుగు గంటలకు అరెస్టు చేసి బోయిన్పల్లి స్టేషన్కు తీసుకురావడంపై తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి వెంకటరమణ రావు, రాసూరి రాజేష్, పట్టణానికి చెందిన కౌన్సిలర్లు, నాయకులు నరాల శేఖర్, కందుల క్రాంతి, రంగు రాములు, చంద్రగిరి ప్రశాంత్, బిజెపి సీనియర్ నాయకులు ఎర్ర మహేష్, అనుపురం కోడుముంజ, చంద్రగిరి,మాజీ సర్పంచులు, బుర్ర బాబు, బిజెపి నాయకులు చంద్రగిరి ప్రశాంత్ జక్కుల మధు, శ్రీధర్ తోపాటు తదితరులు ఉన్నారు.