బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్..

Early arrest of BRS leaders– బీఆర్ఎస్ నాయకులు వడ్డే బాలయ్య హౌస్ అరెస్ట్

నవతెలంగాణ – కొత్తూరు
రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలుపాలని బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ నాయకులను వారి నివాసాల వద్ద ఎక్కడికక్కడ అరెస్టులు చేపడుతున్నారు. బిఆర్ఎస్  నాయకులు వడ్డే బాలయ్య ను సిద్దపురంలోని ఆయన ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన అని చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వంలో అరెస్టులో పర్వం ఏంటని విమర్శించారు. అరెస్టులతో ప్రభుత్వాన్ని నడపలేరని కాంగ్రెస్ నాయకులకు అయన ఇతవు పలికారు. అరెస్ట్ అయిన వారిలో వస్పరి శ్రీను, దయ్యాల నరసింహ, ఐలయ్య, వెంకటయ్య తదితరులు ఉన్నారు.